విజయనగరం అర్బన్: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం అందించాలని జేసీ మయూర్ అశోక్ ఆదేశించారు. స్పందన హాల్ వద్ద ఐసీడీఎస్ పోషణ్‌పక్వాడాలో భాగంగా సోమవారం ఏర్పాటు చేసిన పౌష్టికాహార ప్రదర్శనను సందర్శించారు. పిల్లలకు, మహిళలకు అందించే పాలప్యాకెట్‌లను తనిఖీ చేశారు. గడువు తేదీని పరిశీలించి పాలప్యాకెట్లు తీసుకోవాలన్నారు. ఫోర్టిఫైడ్ బియ్యం నాణ్యతపై ఆరా తీశారు. రాగులు, జొన్నలు తదితర చిరుధాన్యాలతో తయారుచేసిన వంటకాలను తిలకించారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 3 వరకు 15 రోజులపాటు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నట్టు ఐసీడీఎస్ పీడీ శాంతకుమారి జేసీకి వివరించారు. కార్యక్రమంలో సీడీపీఓ ప్రసన్న, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.