
పార్టీలో చేరిన వారితో బీజేడీ నాయకులు
బరంపురం: కొందమాల్–గజపతి–గంజాం జిల్లాల సరిహద్దు నుంచి అక్రమ నగరానికి తరిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు నిమ్మఖండి పోలీసు స్టేషన్ పరిధి శ్రీక్షేత్ర విహార్ 5వ లైన్‌లోని ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఇందులో అక్రమంగా నిల్వ ఉంచిన 22కిలోల గంజాయి తోపాటు కారు, బొలేరో, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి, అరెస్ట్ చేశారు.
నడకపై చైతన్య ర్యాలీ
రాయగడ: ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడే నడకపై స్థానిక మహిళా క్లబ్‌లు ఆదివారం చైతన్య ర్యాలీ నిర్వహించారు. మహిళా వాకర్స్ క్లబ్, జంఝావతి మహిళా వాకర్స్ క్లబ్‌లకు చెందిన మహిళలు పట్టణంలోని గాంధీ పార్క్ నుంచి ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాటీ చేపట్టారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే నడకను అలవాటు చేసుకోవాలని వివరించారు. క్లబ్ సభ్యులు శోభారాణి, రుబిరాణి కుండు, డాక్టర్ కె.సల్వరాజు, డాక్టర్ ఎన్‌కే కుండు తదితరులు పాల్గొన్నారు.
బీజేడీ లోకి వెంకటాపురం గ్రామస్తులు
పర్లాకిమిడి: కాశీనగర్ సమితి కిడిగాం పంచాయతీ వెంకటాపురం గ్రామస్తులు ఆదివారం బిజూ జనతాదళ్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జగబంధు దాస్, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, సీనియర్ నాయకులు తిరుపతి పాణిగ్రాహి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో... గ్రామానికి చెందిన బారి నాగరాజు, పి.గోవిందరావు, చిన్నరావు, బారి లింగరాజు, బి.తిరుపతిరావు, కె.గుర్రులు, కె.వెంకట్రావు, పి.సుధాకర్, సి.శ్రీరాములు తదితరులు బీజేడీ లోకి చేరారు. మిశ్రణ్ పర్వ్‌లో కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, రూపేష్ పాణిగ్రాహి, కాశీనగర్ అధ్యక్షుడు అఖిల పాత్రొ తదతరులు పాల్గొన్నారు.
భూగర్భంలో వేంకటేశ్వర స్వామి విగ్రహం
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి కేంద్రంలో భూమిలో ఓ వేంకటేశ్వర స్వామి విగ్రహం లభ్యమైంది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక జగన్నాథ మందిరం అర్చకులు రవిశాస్త్రికి ఈనెల 17న కలలో వేంకటేశ్వర స్వామి కనిపించి, ఆలయ పరిసరాల్లో తన విగ్రహం ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు మరుసటి రోజు ఉదయం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులకు విషయం వివరించారు. ఆదివారం ఉదయం అంతా కలిసి చిత్రకొండ నుంచి 2కిలోమీటర్ల దూరంలోని నది నుంచి కలశాలతో నీటిని తీసుకు వచ్చి, మందిరం చుట్టపక్కల తవ్వకాలు చేశారు. 8 అడుగుల లోతున భూగర్భంలో స్వామివారి విగ్రహం కనిపించింది. ఈ మేరకు విగ్రహానికి శుద్ధి చేసి, తాత్కాలికంగా జగన్నాథ మందిరంలో ప్రతిష్టించడంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు.

జగన్నాథ మందిరంలో భద్రపరిచిన వెంకటేశ్వర స్వామి విగ్రహం