
విద్యార్థులకు అప్రెంటిస్ సర్టిఫికెట్లు అందజేస్తున్న బ్యాంక్ మేనేజర్ మురళి
పార్వతీపురంటౌన్: అప్రెంటిస్ సర్టిఫికెట్ల ద్వారా అభ్యర్థులకు చక్కని ఉద్యోగావకాశాలు ఉంటాయని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పార్వతీపురం బ్రాంచ్ సీనియర్ మేనేజర్ బి.మురళి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన పార్వతీపురం పట్టణంలోని వాసవి, గాయత్రి డిగ్రీ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు గాయత్రి కళాశాలలో ఇండియా పోస్ట్ బ్యాంకు ద్వారా అప్రెంటిస్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్‌కు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా అప్రెంటిస్ పొందిన విద్యార్థులకు చక్కని అవకాశం ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాంక్ తదితర కాంపిటేటివ్ ఉద్యోగా ఎంపికలో ఈ సర్టిఫికెట్లు ఉపయోగపడతాయన్నారు. కళాశాల యాజమాన్యం చొరవతో తమ ఇండియన్ పోస్టల్ బ్యాంకు ద్వారా విద్యార్థులకు 90 రోజులపాటు విద్యార్థులకు అప్రెంటిస్ అవకాశాన్ని కల్పించనున్నట్లు చెప్పారు. అప్రెంటిస్ కాలాన్ని చక్కగా క్రమశిక్షణతో పూర్తి చేసుకున్న విద్యార్థులను అభినందిస్తూ సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థులు భవిష్యత్తులో కాంపిటేటివ్‌పై దృష్టి సారించి ఉద్యోగాలు సంపాదించాలని కార్యక్రమంలో పాల్గొన్న ఇండియా పోస్ట్‌పేమెంట్స్ బ్యాంక్ మేనేజర్ సీహెచ్ సాగర్ అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శర్మ, ఏఓలు గౌరీశంకర్, శ్రీనివాసరావు, వి.దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్
సీనియర్ మేనేజర్