చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బందరులోని రేవతి సెంటర్ వద్ద అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించి అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను మంగళవారం ఆయన విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తారన్నారు. అగ్నిప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాన్నారు. ఆపద సమయాల్లో ప్రాణాలను రక్షించటంలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర కీలకమైనదన్నారు. అనంతరం అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించే పలు పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి ఏసురత్నం, ఫైర్ ఆఫీసర్ ఆనం రమణారెడ్డి, ఫైర్‌మెన్లు వెంకటేశ్వరరావు, జకరయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ


