మట్టి పెళ్లలు పడి మహిళ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

మట్టి పెళ్లలు పడి మహిళ దుర్మరణం

Apr 15 2026 8:50 AM | Updated on Apr 15 2026 8:50 AM

మట్టి పెళ్లలు పడి మహిళ దుర్మరణం

గంపలగూడెం: మట్టి పెళ్లలు విరగి పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరొకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మండలంలోని అమ్మిరెడ్డిగూడెంలో మంగళవారం జరి గింది. గ్రామస్తుల కథనం మేరకు.. అమ్మి రెడ్డిగూడెం గ్రామానికి చెందిన గుంజు రాంబాబు ట్రాక్టర్‌తో ఇసుక, మట్టి తోలుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య ధనలక్ష్మి (30), కుమార్తె రాజి, కుమారుడు ప్రవీణ్‌, తల్లి నాగలక్ష్మి ఉన్నారు. రాజి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పూర్తగా, ప్రవీణ్‌ ఐదో తరగతి చదువుతున్నాడు. గంగదేవరపాడు పరిధిలోని కట్టలేరులో ఇసుక తోడేందుకు రాంబాబు తన భార్య ధనలక్ష్మి (30), తల్లి నాగలక్ష్మితో కలిసి వెళ్లాడు. కట్టలేరులో పూర్తి స్థాయిలో ఇసుక తోడేశారు. ఎక్కడ మంచి ఇసుక దొకనందున తెలంగాణ పరిధిలో ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లి ఇసుక తవ్వకాలు చేపట్టారు. పైన మట్టి, కింద ఇసుక ఉండ టంతో సొరంగం చేసి ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఐదు అడుగుల లోతున 20 అడుగుల మేర సొరంగం చేసి ఇసుక తోడుతున్న నేపథ్యంలో పైనున్న మట్టి పెళ్లలు విరిగి ధనలక్ష్మి, నాగలక్ష్మిపై పడ్డాయి. దీంతో వారిద్దరు మట్టికింద చిక్కుకుపోయారు. హుటాహుటిన మూడు ట్రక్కుల మట్టి తొలగించి వారిద్దరిని బయటకు తీసి 108 అంబులెన్స్‌లో తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ధనలక్ష్మి (30) మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన నాగ లక్ష్మిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లి ఆస్పత్రి పాలై, భార్య తిరిగిరాని లోకాలకు చేరడంతో రాంబాబు తన ఇద్దరు బిడ్డలను అక్కున చేర్చుకుని రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

మరో మహిళకు తీవ్ర ఆస్వస్థత

Advertisement
 
Advertisement
Advertisement