రైతుల సమస్యలపై వాదనలు శుభ పరిణామం | - | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యలపై వాదనలు శుభ పరిణామం

Apr 15 2026 8:50 AM | Updated on Apr 15 2026 8:50 AM

రైతుల సమస్యలపై వాదనలు శుభ పరిణామం

గుడివాడ టౌన్‌: దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో వ్యవసాయ ఉత్పత్తులు, కనీస మద్దతు ధర నిర్ణయం విధానంపై వాదనలు జరపడం శుభ పరిణామమని రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎం.వి.ఎస్‌.నాగిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవ ఖర్చులు, కుటుంబ పనిపై ప్రస్తుత కనీస మద్దతు ధర నిర్ణయం రైతులను ఏమాత్రం ఆదుకోవడం లేదని తెలిపారు. డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ కూడా కనీస మద్దతు ధర ఉండాలని సిఫారసు చేసిందని గుర్తుచేశారు. వాస్తవ ఖర్చులు, కుటుంబ ఖర్చులు, భూమి లీజు, పెట్టుబడి వడ్డీలకు అనుగుణంగా మద్దతు ధర నిర్ణయం సరిగ్గా లేదని పేర్కొన్నారు. ఈ సమస్యను ఎప్పటి నుంచో లేవనెత్తుతున్నామని, కనీస మద్దతు ధర నిర్ణయిస్తే సరిపోదని, ఆ ధర రైతుకు చేరేలా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు ప్రతినిధిగా ఈ విషయంపై సుప్రీంకోర్టులో వాదన జరగడం తాను స్వాగతిస్తున్నాని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement