జ్వాలాముఖి అమ్మవారికి స్వర్ణకవచం సమర్పణ | - | Sakshi
Sakshi News home page

జ్వాలాముఖి అమ్మవారికి స్వర్ణకవచం సమర్పణ

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

జ్వాలాముఖి అమ్మవారికి స్వర్ణకవచం సమర్పణ

అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాల యంలో వేంచేసిన్న జ్వాలాముఖిదేవి అమ్మవారికి సోమవారం స్వర్ణకవచాన్ని సమర్పించారు. దేవదాయశాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్‌.శ్రీనివాసరెడ్డి అమ్మవారికి రాగిపై బంగారుపూత వేసిన కవచాన్ని సమర్పించారు. సుమారు 40గ్రాముల బంగారంతో సుమారు రూ.6 లక్షల విలువైన వెండి కవచాన్ని అర్చకులు సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు, జ్వాలాముఖి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement