మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి వివిధ సేవా టికెట్ల ద్వారా ఆదివారం రూ.8,00,551 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. స్వామివారి సేవా టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.4,00,082లు, లడ్డు ప్రసాదం ద్వారా వచ్చిన ఆదాయం రూ.1,24,075లు, డొనేషన్ ద్వారా వచ్చిన ఆదాయం రూ.1,95,764లు, స్వామివారి కల్యాణకట్ట టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.33,480లు తదితర సేవా టికెట్ల ద్వారా మొత్తం రూ.8,00,551లు ఆదాయం సమకూరినట్లు వివరించారు.


