మైలవరం: ఎన్టీఆర్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వై.శేషగిరిరావు ఎన్నికయ్యారు. మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇండోర్ స్టేడియంలో సోమవారం ఎన్టీఆర్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా ఐ.మురహరి వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వై.శేషగిరిరావు, ఉపాధ్యక్షులుగా ఆర్.రమేష్, ఎస్.సుబ్బారావు, కార్యదర్శి పి.బుజ్జి(ఏకగ్రీవం), సంయుక్త కార్యదర్శులుగా ఎల్.సతీష్ వర్మ, కె.రవిశంకర్, కోశాధికారిగా బి.చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా వై.హేమాంబిక, ఎం.మాధవీలత, బి.భారతి ఎన్నికయ్యారు. ఎన్నిక తదనంతరం జనరల్ బాడీ సమావేశంలో పది క్లబ్ ప్రతినిధులు, గౌరవ అధ్యక్షుడిగా పి.అజయ్‌కుమార్, చైర్మన్‌గా రానాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో కోఆప్షన్ సభ్యులుగా బి.ప్రేమ్ తేజా, మౌనిక, హర్షలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం 33 శాతం సీ్త్రలకు, 25 శాతం క్రీడా సంబంధిత వ్యక్తులను అసోసియేషన్ ద్వారా ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి మురహరి తెలిపారు.


