డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్‌ ప్రారంభోత్సవం | - | Sakshi
Sakshi News home page

డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్‌ ప్రారంభోత్సవం

Apr 6 2026 8:30 AM | Updated on Apr 6 2026 8:30 AM

భవానీపురం(విజయవాడపశ్చిమ): సమాజం ద్వారా పొందిన జ్ఞానాన్ని, సహాయాన్ని తిరిగి అదే సమాజానికి అందించాలన్న మహనీయుల మాటలను స్ఫూర్తిగా తీసుకుని పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను అందిస్తున్న ఎస్‌కేపీవీవీ గ్రూప్‌ యాజమాన్యం అభినందనీ యులని ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు. ఎస్‌కేపీవీవీ హిందూ హై స్కూల్స్‌ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ రూరల్‌ జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎస్‌కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్‌ను ఆయన ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్‌ మాట్లాడుతూ.. ఆరున్నర ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ హై స్కూల్‌ విద్యలవాడగా పేరొందిన విజయవాడకే తలమానికంగా నిలుస్తుందన్నారు. ఈ హై స్కూల్‌ నిర్మాణానికి భూరీ విరాళం ఇచ్చిన డోకుపర్తి ఉపేంద్రను అభినందించారు. హిందూ హై స్కూల్స్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు టి. శేషయ్య, గోపిశెట్టి మల్లయ్య మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతివర్గాల విద్యార్థులకు తక్కువ ఫీజులతో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో విద్యను అందించాలన్న లక్ష్యంతో ఈ పాఠశాలను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్‌, శ్రీరాం రాజగోపాల్‌(తాతయ్య), రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎంఎస్‌ బేగ్‌, దూదేకుల కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌మీరా, హిందూ హై స్కూల్స్‌ కమిటీ ట్రెజరర్‌ గోళ్ల బాబా విజయ్‌ కుమార్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వి.నారా యణరావు, స్కూల్‌ ఇన్‌చార్జ్‌ సెక్రటరీ డాక్టర్‌ టి.శ్రీనివాసు, స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పి.శ్యామల, కమిటీ సభ్యుడు వేముల హజరతయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డోకుపర్తి ఉపేంద్ర దంపతులను సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement