
విధుల్లో చేరిన డీపీఎంలు
డొంకేశ్వర్(ఆర్మూర్): ఐకేపీలో బదిలీలు పూర్తి చేసుకున్న డీపీఎంలు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి విధుల్లో చేరారు. వేరే జిల్లాల నుంచి మన జిల్లాకు వచ్చిన మోహన్‌కు మార్కెటింగ్, రాజేశ్వర్‌కు పెన్షన్, కిరణ్‌కు ఫైనాన్స్ సెక్షన్లు ఇచ్చారు. అలాగే మన జిల్లాలోనే ఉన్న డీపీఎంలు నీలిమాకు ఐబీ, రాచయ్యకు జీవనోపాధుల విభాగాలను కేటాయించారు. విధుల్లో చేరి సెక్షన్ల బాధ్యతలు చేపట్టిన డీపీఎంలు మంగళవారం డీఆర్‌డీవో సాయాగౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈసందర్భంగా డీఆర్‌డీవో డీపీఎంలకు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ఎలాంటి ఫిర్యాదులు రాకుండా పని చేయాలని వారికి సూచించారు.