
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను కచ్చితంగా తెలసుకుని ముందుకు వెళ్లా లని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీ తక్క) అన్నారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్లమెంట రీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిజామాబాద్ డీసీ సీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అధ్యక్షతన జి ల్లా కేంద్రంలోని ఈవీఎం గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించారు. నిజా మాబాద్, కామారెడ్డి, నిర్మల్, కోరుట్ల, జగిత్యాల, జుక్కల్‌ల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు, ఆయా కార్పొరేషన్ల చైర్మన్ లు, జిల్లా బాధ్యులు, పలు విభాగాలకు చెందిన నాయకులు హాజరయ్యారు.
కార్యకర్తలనుద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలుచేస్తున్నామన్నారు. కేవలం తొమ్మిదిరోజుల్లో రూ.9 వేల కోట్ల రూపాయల రైతుభరోసా ఇచ్చామన్నారు. సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్రం దేశంలో కేవలం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. రూ.21 వే కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కతుందని, అధికారంలోకి రాగానే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం వంటి పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేశామని వివరించారు. ఇన్ని మంచి పథకాలు అమలు చేస్తున్నా.. వాటిని ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు వెనుకబడి ఉన్నారన్నారు. ఈనెల 4న హైదరాబాద్‌లో నిర్వహించే కార్యకర్తల సదస్సుకు వేల సంఖ్యలో కార్యకర్తలు హాజరు కావాలని, ప్రతి గ్రామం నుంచి 500 మందిని తీసుకురావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, మదన్‌మోహన్, డాక్టర్ సంజయ్, వెడ్మ బొజ్జు, లక్ష్మీకాంతారావు, ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రావు , కార్పొరేషన్‌ల చైర్మన్‌లు ఈరవత్రి అని ల్, తాహెర్‌బిన్ హందాన్, మానాల మోహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు, నాయకులు రాంభూపాల్, విపుల్‌గౌడ్, బాడ్సి శేఖర్ గౌడ్, కేతావత్ యాదగిరి, నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను కార్యకర్తలు తెలుసుకోవాలి
దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి..
క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)