
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
రుద్రూర్: కోటగిరి గ్రామ శివారు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను బుధవారం పట్టుకున్నట్టు ఎస్సై సునీల్ తెలిపారు. ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి డ్రైవర్, యజ మానిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
యువకుడి ఆత్మహత్య
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మర్కల్ గ్రామానికి చెందిన పల్లె మనోహర్(18) అనే యువకుడు బుధవారం వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతికి గల కారణాలు తెలియరాలేదని ఎస్సై పేర్కొన్నారు.