
క్రీడల్లో నిరంతర సాధనతోనే విజయం సాధ్యం
నిజామాబాద్‌నాగారం: క్రీడాకారులు ప్రతినిత్యం క్రీడల్లో సాధన చేస్తేనే పోటీల్లో విజయం సాధిస్తారని జిల్లా యువజన క్రీడల అధికారి పవన్‌కుమార్ అన్నారు. నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగారంలోని రాజారం స్టేడియంలో అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించగా, గురువారం విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్‌కుమార్ హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరూ క్రీడలు ఆడడం వల్ల చెడు ఆలవాట్లకు దూరంగా ఉంటారన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతినిత్యం క్రీడలు ఆడాలన్నారు. అనంతరం విజేతలకు ట్రోఫీలను అందజేశారు. జిల్లా ట్రస్మా చీఫ్ అడ్వైజర్ మామిడాల మోహన్, టీచర్స్ యూనియన్ బీసీ నాయకులు మురళీకృష్ణ, అసోసియేషన్ సభ్యులు మధు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విజేతలు వీరే.. బాలుర విభాగంలో.. మొదటి ఓవరాల్ చాంపియన్‌షిప్ మహాత్మ జ్యోతిబాపూలే మోర్తాడ్ జట్టు కై వసం చేసుకుంది. రెండో చాంపియన్‌షిప్ క్షత్రియ పాఠశాల పెర్కిట్ అందుకుంది. మూడో చాంపియన్‌షిప్ సిద్ధార్థ పాఠశాల నందిపేట్ సాధించింది. బాలికల విభాగంలో.. మొదటి చాంపియన్‌షిప్ కేజీబీవీ సిరికొండ సాధించింది. రెండో చాంపియన్‌షిప్ విజయ హైస్కూల్ నిజామాబాద్ అందుకుంది. మూడో చాంపియన్‌షిప్ విద్యా హైస్కూల్ డిచ్‌పల్లి కై వసం చేసుకుంది.