
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి
తెయూ(డిచ్‌పల్లి): మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టగా గురువారం తెలంగాణ యూనివర్సిటీలో పీజీ కళాశాలల తరగతులు బంద్ చేయించారు. అనంతరం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కళాశాలల తరగతులు బంద్ చేయించి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న విద్యార్థులకు ప్రయివేట్ యూజీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు. దీంతో ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు పేద విద్యార్థులు దూరం అవుతున్నారన్నారు. అలాగే యూనివర్సిటీలలో విద్యార్థులకు మెస్ బకాయిలు పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు ప్రిన్‌ప్రిన్స్, నిఖిల్, హుస్సేన్, సాయికిరణ్, సాయి, దుర్గాప్రసాద్, కల్యాణ్, విద్యార్థులు పాల్గొన్నారు.
పీడీఎస్‌యూ నాయకుల డిమాండ్
కళాశాలల్లో తరగతుల బహిష్కరణ

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి