
బాధ్యతల స్వీకరణ
ఖలీల్‌వాడి: నిజామాబాద్ ఇన్‌చార్జి ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌వోగా సుస్మిత గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌వో దిలీప్ ఇటీవల సాలూర చెక్ పోస్టుకు బదిలీ అయ్యారు. నగరంలోని ఓ కల్లుడిపోకు చెందిన రెండు కల్లు దుకాణాలను ఈత వనాలు లేనందున ఎకై ్సజ్ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంలోనే బదిలీ జరిగినట్లు ఎకై ్సజ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇసుక లారీ పట్టివేత
బోధన్: బోధన్ నుంచి నిజామాబాద్ వైపు అక్రమంగా ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీని గురువారం పట్టుకున్నట్లు ఎడపల్లి ఎస్సై వంశీ కృష్ణారెడ్డి తెలిపారు. లారీ యాజమాని అజీజ్, డ్రైవర్ సిరాజ్ అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.