
ఎకరానికి ఎంత భూమి..
మీకు తెలుసా?
బాల్కొండ: వ్యవసాయ భూములను ఎకరాల్లో(బిగాల్లో) రైతులు తెలుపుతుంటారు. ఎకరానికి ఎంత భూమి అనే విషయాన్ని కింద తెలుసుకుందాం..
● 40 గుంటలకు ఎకరం అవుతుంది.
● రెండు గుంటలకు ఇసా భూమి అవుతుంది
● 20 ఇసాలకు ఎకరం అవుతుంది
● ఎకరానికి 4840 గజాలు అవుతుంది.
● ఎకరానికి 100 సెంట్లు, గుంటకు 2.5 సెంట్లు
● గుంటకు 121 గజాలు
● ఒక సెంట్ భూమికి 48.4 గజాలు
● ఇంటి నిర్మాణాల స్థలాలను ప్లాట్లు అంటారు. ప్లాట్లను గజాల చొప్పున కొనుగోలు చేస్తారు.