
రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లా వాసి మృతి
భిక్కనూరు: మండల కేంద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లా అక్కన్నపేటకు చెందిన ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. అక్కన్నపేటకు చెందిన కొత్తిన్న లక్ష్మీనారాయణ(54) జంగంపల్లి గ్రామశివారులోని విజయ సాయి ల్యాబొరెటరీలో ఫిట్టర్‌గా పనిచేస్తూ అదే గ్రామంలో అద్దెకు ఉంటున్నాడు. బుధవారం వ్యక్తిగత పనుల నిమిత్తం అక్కన్నపేట గ్రామానికి బైక్‌పై ఉదయం వెళ్లి మధ్యాహ్నం తిరిగి జంగంపల్లికి వస్తున్నాడు. భిక్కనూరు చర్చి సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య యాదమ్మ ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.