
స్వగ్రామానికి చేరిన మృతదేహం
కమ్మర్‌పల్లి: ఒమన్ దేశంలో ఆత్మహత్యకు పాల్పడిన కమ్మర్‌పల్లి మండలం హాసకొత్తూర్ గ్రామానికి చెందిన జుంబరాత్ అన్వేశ్(27) మృతదేహం బుధవారం రాత్రి స్వగ్రామానికి చేరుకుంది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. 15 రోజుల క్రితం అన్వేశ్ ఆత్మహత్యకు పాల్పడగా, మృతదేహం తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, కాంగ్రెస్ నేత సునీల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారు గల్ఫ్ కన్వీనర్ భీమ్‌రెడ్డితో మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలిపారు. ఎంబసీ అధికారులతో మాట్లాడి మృతదేహం స్వగ్రామానికి రావడానికి కృషి చేశారు.