నేను వీసీ మనిషిని.. | - | Sakshi
Sakshi News home page

నేను వీసీ మనిషిని..

Jul 2 2025 6:55 AM | Updated on Jul 2 2025 6:55 AM

నేను వీసీ మనిషిని..

నేను వీసీ మనిషిని..

తెయూలో ఓ అధికారి ఇష్టారాజ్యం

డబ్బులు దండుకునేందుకు

దొంగ లెక్కలు

సహచర సిబ్బందికి వేధింపులు

విచ్చలవిడిగా అడ్వాన్సులు..

ఇటీవల జరిగిన కళాశాల వార్షికోత్సవంలోనూ నాలుగు ఫ్లడ్‌లైట్లు, సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పా టు చేయించి ఏకంగా రూ.2.35 లక్షల బిల్లు క్లెయి మ్‌ చేయడంతోపాటు నిర్వహణ ఖర్చుల కింద మరో రూ.40 వేల బిల్లు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. మే నెలలో మహనీయుల జయంతి పేరుతో ఆయా అధికారులకు నిర్వహణ బాధ్యతలను అప్పగించినప్పటికీ సదరు అధికారి తానే అజమాయిషీ చెలాయించాడనే విమర్శలు ఉన్నా యి. మహనీయుల జయంతి సందర్భంగా మహి ళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సెల్‌లు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు తానే వర్సిటీ నుంచి డ బ్బులు తీసుకునందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టినట్లు సమాచారం. ఇప్పటికే కీలక పదవిలో ఉన్న ఆయనకు ఇటీవల వసతిగృహాల అదనపు బాధ్యతలు అప్పగించారు. సంబంధిత విభాగంలో విచ్చలవిడిగా అడ్వాన్సులు తీసుకుంటున్న ట్టు తెలిసింది. వీసీ మనిషి కావడంతో ఎవ్వరు కూడా అభ్యంతరం చెప్పలేని పరిస్థితి. ముగ్గురు బోధనేతర మహిళా సిబ్బందిని సదరు అధికారి వేధిస్తున్నట్లు సమాచారం. ఆ ముగ్గురు ఉద్యోగులు రిజిస్ట్రార్‌ను కలువగా, తానేమీ చేయలేనని, వీసీని కలవాలని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా వీసీని కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సదరు అధికారి మరింత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారనే చర్చ వర్సిటీలో సాగుతోంది.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ‘నేను వీసీ మనిషిని.. నన్ను ఆపేదెవరు..’ అంటూ తెలంగాణ యూనివర్సిటీలో ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నాని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా లెక్క ల్లో గోల్‌మాల్‌ చేస్తూ డబ్బులు నొక్కేస్తున్నాడని, వైస్‌ ఛాన్స్‌లర్‌ ఎదుట మాత్రం ‘ఎస్‌ బాస్‌’ అన్నట్లుగా వ్యవహరిస్తూ సహచర సిబ్బందిని మాత్రం వేధిస్తున్నాడని విద్యార్ధి నాయకులు అంటున్నారు.

మే 3వ తేదీన ‘నీట్‌ యూజీ’ ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించగా, యూనివర్సిటీ కళాశాలతోపాటు వర్సిటీలోని మరో కళాశాలతో కలిపి రెండు పరీక్ష కేంద్రాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కేటాయించింది. ఈ కేంద్రాల్లో దాదాపు 1,100 మంది అభ్యర్థులను కేటాయించారు. ఈ పరీక్ష కేంద్రాలకు సదరు అధికారిని, మరో కళాశాలకు అతడి సన్నిహితుడిని సూపరింటెండెంట్లుగా నియమించారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా స్టేషన రీ ఖర్చులు, తాగునీరు, శానిటైజేషన్‌, నంబర్లు వేయడం వంటి పనులకు, సంబంధిత సబ్‌ స్టాఫ్‌కు చెల్లించేందుకు అదనంగా పరీక్ష కేంద్రం నిర్వహణ కోసం ఒక్కో అభ్యర్థికి రూ.60 చొప్పున పరీక్ష తేదీకి వారం రోజులు ముందుగానే ఎన్‌టీఏ చెల్లించింది. రెండు పరీక్ష కేంద్రాల్లో పనిచేసిన సిబ్బందికి ఎన్‌టీఏ నిర్ణయించిన మొత్తాన్ని ఇవ్వలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే తాను వీసీ మనిషిని అని సదరు అధికారి చెబుతుండడంతో సిబ్బంది మిన్నకుండి పోయారని సమాచారం. ఇదిలా ఉంటే యూనివర్సిటీకి చెల్లించాల్సిన రూ.66వేలను సైతం గుట్టుచప్పుడు కాకుండా నొక్కేసినట్లు తెలుస్తోంది. పరీక్ష పూర్తయిన వెంటనే రిజిస్ట్రార్‌ అకౌంట్‌లో జమ చేయాల్సిన ఆ మొత్తాన్ని జేబులో వేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే 2009లో ఆచార్య లింబాగౌడ్‌ ప్రిన్సిపల్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు బయటి సంస్థలు ఎలాంటి పరీక్షలు జరిగినా సెంటర్‌ నిర్వహణ కోసం నిర్దేశిత మొత్తాన్ని నిర్వహణ ఖర్చుల కోసం యూనివర్సిటీ అకౌంట్‌లో జమ చేసే అనవాయితీ పాటిస్తూ వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement