
సీఎంను విమర్శించే స్థాయి ప్రశాంత్‌రెడ్డికి లేదు
తెయూ(డిచ్‌పల్లి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఓర్వలేక మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజా సంక్షేమానికి అహర్నిషలు కృషి చేస్తున్న సీఎంను విమర్శించే స్థాయి ప్రశాంత్‌రెడ్డికి లేదన్నారు. శుక్రవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని కేఎన్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగేష్‌రెడ్డి మాట్లాడారు. స్థానిక ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలువడం ఖాయమని నగేష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డిచ్‌పల్లి మాజీ ఎంపీపీ చిన్నోల్ల నర్సయ్య, కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, మోపాల్ సొసైటీ ఛైర్మన్ గంగారెడ్డి, నాయకులు పులి వెంకటేశ్వరరావు, సుదాం శ్రీనివాస్, రాధ, తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో యూత్
కాంగ్రెస్ ప్రముఖ పాత్ర వహించాలి
నిజామాబాద్ సిటీ : స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు కృషిచేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్‌గౌడ్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ స్థాయీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా విపుల్‌గౌడ్ మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు వస్తాయని తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేయాలని కోరారు. త్వరలో సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు యూసుఫ్, బింగి శుభం, మోసిన్‌ఖాన్, దినేష్ కుమార్, దీక్షిత్ కుమార్, సయీద్ ముద్దశీర్, సర్ఫరాజ్,అక్రం, ఫైజల్ పాల్గొన్నారు.