నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ జిల్లా కేంద్రంలో సీనియర్ వైద్యుడు డాక్టర్ చిటికేశి సంతోష్‌రాజ్‌పై దాడి చేసిన నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత వైద్యుడిని ఎమ్మెల్యే పరామర్శించారు. దాడికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ కుటుంబ సభ్యులు వైద్యుడిపై దాడి చేసి 24 గంటలు గడుస్తున్నా పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. న్యాయం చేయాలని వైద్యులందరూ రోడ్డెక్కితే పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.


