నిర్మల్ రూరల్: ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా చదువు నేర్చుకుంటున్న అభ్యాసకులకు ఆదివారం ఎన్‌ఐవోఎస్ పరీక్ష జరగనుంది. దీనికోసం ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లా గ్రా మీణాభివృద్ధి శాఖ, జిల్లా విద్యాశాఖ, జిల్లా వయోజన విద్యాశాఖ సమన్వయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. గత అక్టోబర్ నుంచి 100 రోజులపాటు అమ్మకు అక్షరమాల అనే కార్యక్రమంలో భాగంగా అక్షర కేంద్రాలలో చదు వు నేర్చుకున్న అభ్యాసకులకు ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మూడు గంటలపాటు అన్ని గ్రామ పంచాయతీల్లో పరీక్ష నిర్వహిస్తారు. శుక్రవారం దీనికి సంబంధించిన మెటీరియల్‌ను డీఆర్డీవో విజయలక్ష్మి, డీఈవో భోజన్న, ఉపాధి హామీ ఏపీఎంలకు అందజేశారు. ఇందులో డీఆర్డీవో ఏఈడీ చరణ్, డీపీఎం శోభారాణి, నరసింహమూర్తి, విద్యాశాఖ సీఎంవో ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


