
ముంబాయి : పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తన భర్తను భుజాలపై మోస్తూ గ్రామం మొత్తం ఊరేగించిందో ఇల్లాలు. మహారాష్ట్ర పూణేలోని పలు అనే గ్రామంలో జరిగిన పంచయతీ ఎన్నికల్లో తన భర్త సంతోష్ గురవ్ 221 ఓట్లు సాధించి ప్రత్యర్థిపై 44 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందండంతో రేణుక ఆనందానికి అవధుల్లేవు. దీంతో భర్తను భుజాలపై ఎక్కించుకుని ఊరంతా తిప్పుతూ ఊరేగించింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో విజయోత్సవాలను ఘనంగా జరుపుకోవడంపై కలెక్టర్ నిషేధం విధించారు. సంబరాల్లో ఐదుగురికి మించి అనుమతించమని ఆంక్షలు విధించారు. దీంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంబరాలు నిర్వహించింది. ఈమె భర్త కూడా చిరునవ్వులు చిందిస్తూ తెగ ఖుషీ అయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ( బాక్సర్‌ను వివాహమాడిన నటి)