TN: ‘‘మహిళలకు ఆ పార్టీలో విలువ లేదు’’ | Tamilnadu Defected Mla Vijaya Vardhini Comments On Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌పై పార్టీ వీడిన తమిళ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Feb 26 2024 1:39 PM | Updated on Feb 26 2024 1:40 PM

Tamilnadu Defected Mla Vijaya Vardhini Comments On Congress - Sakshi

చెన్నై: కాంగ్రెస్‌లో మహిళలకు చోటు లేదని తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తమిళనాడు ఎమ్మెల్యే విజయ వర్థిని అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గత 14 ఏళ్లుగా ఉన్న ఒకే ఒక మహిళా ఎమ్మెల్యేను నేను. నన్ను కూడా పార్టీలో నుంచి వెళ్లకుండా ఆ పార్టీ ఆపలేకపోయింది.

దీన్ని బట్టే ఆ పార్టీ ఎలా పనిచేస్తోందో అర్థమవుతోంది. ఒక మహిళ ఎమ్మెల్యే పదవి దగ్గరే ఎందుకు ఆగిపోవాలి. బీజేపీ మహిళలకోసం ఎంతో చేస్తోంది. ఆపార్టీ తరపున పార్లమెంట్‌లో మహిళా ఎంపీలు చాలా మంది ఉన్నారు. బీజేపీ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు ఇచ్చింది. త్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేసింది.

ముస్లిం మహిళలు కేవలం బీజేపీకే ఓటు వేస్తారు’అని విజయవర్థిని అన్నారు. కన్యాకుమరి జిల్లాలో విల్వన్‌కోడ్‌ నియోజకవర్గం నుంచి 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున విజయవర్థిని ఎమ్మెల్యేగా గెలిచారు. శనివారం(ఫిబ్రవరి 24)న ఆమె కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 

ఇదీ చదవండి.. మహారాష్ట్రలో మళ్లీ రిజర్వేషన్‌ మంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement