నేషనల్‌ హైవేపై ప్రమాదం.. పుణ్యస్నానాలకు వెళ్లి అనంతలోకాలకు.. | Pilgrims Dead In Assam Road Accident On National Highway-37 | Sakshi
Sakshi News home page

పుణ్యస్నానాలకు వెళ్లివస్తుండగా ఘోర ప్రమాదం.. యాత్రికులు మృతి

Jan 16 2023 7:20 PM | Updated on Jan 16 2023 7:21 PM

Pilgrims Dead In Assam Road Accident On National Highway-37 - Sakshi

గువాహటి: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పుణ్యస్నానాల కోసం వెళ్లిన భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యాత్రికులు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

వివరాల ప్రకారం.. మోరిగావ్‌ జిల్లాలోని ధరామ్‌తుల్‌ ఏరియాలో జాతీయ రహదారి 37పై రోడ్డు ప్రమాదం జరిగింది. మకర సంక్రాంతి సందర్భంగా ఒకే ప్రాంతానికి చెందిన కొందరు లోహిత్‌ నదిలో పుణ్యస్నానాలకు వెళ్లారు. పుణ్యస్నానాలు ముగించుకుని తిరిగి ఇళ్లకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. 

యాత్రికులతో వెళ్తున్న వాహనం ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టడంతో ముగ్గురు యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిని వారికి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు. ఇక, పుణ్యస్నానాల కోసం వెళ్లిన ఇలా ప్రమాదంలో చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

Advertisement
 
Advertisement
Advertisement