చంఢీగడ్: ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ నుంచి మంటలు రావడంతో చంఢీగఢ్ విమానాశ్రాయంలో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ఇండిగో విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికుడి పవర్‌బ్యాంక్ నుంచి మంటలు వచ్చి పొగ తీవ్రంగా వ్యాపించింది. దాంతో ప్రయాణికుల్ని అత్యవసర తరలింపు చేపట్టారు. విమానాధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ఈరోజు(మంగళవారం, మే 5వ తేదీ) హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానం 6E 108 ల్యాండింగ్ తర్వాత నిలిచి ఉన్నప్పుడు, ఒక ప్రయాణికుడికి చెందిన పవర్‌బ్యాంక్‌కు నిప్పంటుకున్న ఘటన చోటు చేసుకున్నట్లు, ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది.
భద్రతా దృష్ట్యా, వెంటనే ప్రయాణికులను ఖాళీ చేయించామని,, సంబంధిత అధికారులందరికీ తక్షణమే సమాచారం అందించడం జరిగిందని ఆ ప్రకటనలో ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా టెర్మినల్‌కు తరలించామని, వారి ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించడానికి మా బృందం వారిని పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఘటనలో ఐదుగురికి స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
DRAMATIC IN-FLIGHT EVACUATION AFTER POWER BANK CATCHES FIRE IN AN INDIGO PLANE IN CHANDIGARH AIRPORT. pic.twitter.com/2DpL8HSS6G
— Rahul Shivshankar (@RShivshankar) May 5, 2026


