భారీ ఎత్తున పరీక్షా పే చర్చకు సన్నాహాలు.. 13 భాషల్లో మోదీ రాసిన ఎగ్జామ్‌ వారియర్స్‌

Pariksha Pe Charcha 2023: Exam Warriors released 13 languages - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఈసారి భారీ ఎత్తున పరీక్షా పే చర్చా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ప్రతీ ఏడాది వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థులతో చర్చా కార్యక్రమంలో స్వయంగా ప్రధాని మోదీ పాల్గొంటూ వస్తున్నారు. తద్వారా పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రధాని మోదీ.. విద్యార్థులకు మార్గనిర్దేశన చేస్తున్నారు. అయితే.. 

షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 27న ప్రధాని పరీక్ష పే చర్చ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈసారి ఈ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచాలని బీజేపీ యోచిస్తోంది. అందుకే భారీ ఎత్తున్న ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లేందుకు వందలాది పాఠశాలల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించింది. ప్రధాని మోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ పుస్తకాలను పంపిణీ చేసింది. దేశం మొత్తం మీద 13  భాషలలో అందుబాటులోకి(జనవరి 19వ తేదీనే) వచ్చింది ఈ పుస్తకం. విద్యార్థులు ఒత్తిడి దూరం చేసుకునేందుకు.. చిట్కాలతో కూడిన పుస్తకం ఇది. మరోవైపు ప్రధాని పిలుపు మేరకు హెల్తీ బేబీ షో లు నిర్వహిస్తున్నారు నేతలు. 

ఇక.. తెలంగాణ వ్యాప్తంగా చాలా స్కూల్స్‌లో విద్యార్థులు వీక్షించే విధంగా బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకునేందుకు బీజేపీ కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ఎజెండాలోనూ ఈ అంశాన్ని చేర్చింది. బీజేపీ సీనియర్లు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, పలువురు నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దేశం నలుమూలల నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి కొన్ని పోటీలను పెట్టి, విజేతలైన వారికి మాత్రమే కార్యక్రమానికి ఆహ్వానం ఉంటుంది. కార్యక్రమంలో.. ఎంపికైన విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్ పాల్గొంటారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top