సముద్రంలో పడిన మహిళ..! కాపాడిన ఫోటోగ్రాఫర్‌..వీడియో వైరల్‌..!

Man Saves Woman From Drowning At Mumbai Gateway Of India - Sakshi

ముంబై: మనకు ఆపద ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కష్టం. ఆపదలో చిక్కుకుంటే కాపాడే వ్యక్తులు రావడం మన అదృష్టమే. తాజాగా ముంబైలోని. గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో గోడపై కూర్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోతే ఓ ఫోటోగ్రాఫర్‌ తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. వివరాల్లోకి వెళ్తే.. గేట్‌ వే ఆఫ్‌ ఇండియాను చూడడానికి వచ్చిన 30 ఏళ్ల పల్లవి ముండే పక్కనే ఉన్న గోడ మీద కూర్చొని ఉంది.

ఒక్కసారిగా ఆ మహిళకు మైకం రావడంతో పక్కనే ఉన్నా సముద్రంలో పడిపోయింది. అదే సమయంలో అక్కడికి వచ్చినా గులాబ్‌చంద్‌ గోండ్‌ గమనించి ఆమెను రక్షించడానికి వెంటనే సముద్రంలో దూకాడు.   ఆమెను తాడు సహాయంతో ఒడ్డు తీసుకొచ్చాడు . కాగా ఆ మహిళను కాపాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సమయస్పూర్తితో  మహిళను కాపాడినందుకుగాను ఫోటోగ్రాఫర్‌పై ప్రశంసల జల్లులు వెలువెత్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top