‘ఇంజక్షన్‌ పనికి రాదు..! ఆల్కహాల్‌తో అన్నీ సీదా..!’

Long Queues Outside Liquor Shops In Delhi - Sakshi

ఢిల్లీ: కరోనా తీవ్రత దృష్ట్యా కేజ్రీవాల్‌ ప్రభుత్వం సోమవారం రాత్రి నుంచి ఏప్రిల్‌ 26 వరకు పూర్తి లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. దీంతో మందు బాబులు వైన్‌ షాపుల ముందు భారీ క్యూ కట్టారు. మహిళలు కూడా షాపుల ముందు బారులు తీరారు. ఈ నేపథ్యంలో వైన్స్‌ షాప్‌నకు వచ్చిన  ఓ మహిళ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలోని శివపురి గీతా కాలనీ సమీపంలో ఉన్న వైన్స్‌ దగ్గరికి ఆల్కహాల్‌ కొనుగోలు చేయడానికి రాగా, అక్కడే ఉన్న మీడియా ఆ మహిళను పలుకరించగా విచిత్రంగా సమాధానమిచ్చింది. కరోనా వస్తే ఇంజక్షన్‌ బదులు మందు(ఆల్కహాల్‌)ను వాడితే నయమవుతుందని తెలిపింది. తనకు  మెడిసిన్‌ వాడితే ఎలాంటి ఉపయోగం ఉండదని, రోజు ఒక పెగ్‌ మందు తాగితే అన్ని సెట్‌ అవుతుందని తెలిపింది. అంతేకాకుండా డాక్టర్‌‌ రాసే మందు అసలు పనిచేయదని, ఆల్కహాలే సర్వరోగనివారిణి అని తెలిపింది. ఆవిడ చెప్పిన సమాధానం విన్న రిపోర్టర్‌ కంగుతిన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది.

కాగా,  దేశంలో కరోనా వైరస్‌ తీవ్రంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా రోజువారి కేసుల సంఖ్య దాదాపు 3 లక్షలుగా ఉంటోంది.  దేశ రాజధాని  ఢిల్లీలో పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన రేపుతోంది. దీంతో ఆప్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విధించిన రాత్రి  కర్ఫ్యూని లాక్‌డౌన్‌గా మార్చింది. ఢిల్లీలో అత్యధికంగా ఒకే రోజు 25 వేలకుపైగా కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో శరవేగంగా విస్తరిస్తున్న మహమ్మారిని నిలువరించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్‌ 26వ తేదీవరకు లాక్‌డౌన్‌ను ప్రకటించారు.

చదవండి: 870 కిలోమీటర్లు ప్రయాణం చేసిన పాము..! తీరా చూస్తే

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top