Delhi: దుబాయ్‌- ఢిల్లీ ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. | Dubai-Bound Flight From Delhi Flight Receives Bomb Hoax Threat Email | Sakshi
Sakshi News home page

Delhi: దుబాయ్‌ - ఢిల్లీ ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు..

Published Tue, Jun 18 2024 12:39 PM | Last Updated on Tue, Jun 18 2024 1:12 PM

Bomb Threat email To Delhi-Dubai plane In Delhi airport

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెకాఫ్‌కు రెడీగా ఉన్న దుబాయ్‌ విమానంలో బాంబు ఉందంటూ మెయిల్‌ వచ్చింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి దుబాయ్‌ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్‌ రావడం కలకలం సృష్టించింది. కాగా, సోమవారం ఉదయం 9:35 గంటల సమయంలో దుబాయ్‌కి వెళ్లేందుకు విమానం ఢిల్లీ ఎయిర్‌ఫోర్ట్‌లో సిద్ధంగా ఉంది. కాసేపట్లో టేకాఫ్‌ అవుతుందనంగ.. ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ లిమిటెడ్‌ ఆఫీస్‌, ఐజీఐ  ఎయిర్‌పోర్ట్‌కి విమానంలో బాంబు ఉందంటూ కొందరు వ్యక్తులు బెదిరింపు మెయిల్‌ పంపారు అని మంగళవారం తెలిపారు.  

 

 

ఇక, బెదిరింపు మెయిల్‌తో ప్రొటోకాల్‌ ప్రకారం.. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదని వెల్లడించారు. అది బూటకపు మెయిల్‌ అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా.. ఇదే జూన్‌ నెలలో ఢిల్లీ నుంచి కెనడా వెళ్తున్న ఎయిర్‌ కెనడా విమానానికి కూడా బాంబు బెదిరింపు బెయిల్‌ వచ్చింది. అది కూడా ఫేక్‌ అని తేలింది. ఈ ఘటనలో ఫేక్‌ మెయిల్‌ పంపిన వ్యక్తిని యూపీకి చెందిన మైనర్‌గా గుర్తించారు. అనంతరం, కౌన్సిలింగ్‌ ఇచ్చారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement