Black Fungus: ఎలా గుర్తించాలి, ఏం చేయాలి?

AIIMS Issues New Guidelines On How To Identify Black Fungus Cases - Sakshi

న్యూఢిల్లీ: ఓవైపు మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంటే..  మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌(మ్యూకోర్‌మైకోసిస్) సైతం పంజా విసురుతోంది. కోవిడ్‌​ నుంచి కోలుకున్న వారిలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు బయటపడటం కలవరపాటుకు గురిచేస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటికే 90 మంది మ్యూకోర్‌మైకోసిస్ కారణంగా మరణిచంగా, రాజస్తాన్‌లో 100 కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, బ్లాక్‌ ఫంగస్‌ ఉనికిని గుర్తించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎవరు మరింత అప్రమత్తంగా ఉండాలన్న విషయమై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. 

ఎవరికి రిస్కు ఎక్కువ?
1. షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో లేనివారు. స్టెరాయిడ్స్‌ తీసుకుంటున్న డయాబెటిక్‌ పేషెంట్లు, డయాబెటిక్‌ కెటోయాసిడోసిస్‌(అత్యధికంగా కీటోన్లు విడుదల కావడం)తో బాధపడుతున్న వారు.
2. యాంటీ కాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు.
3. అధికమొత్తంలో స్టెరాయిడ్స్‌ తీసుకుంటున్న వారు, ముఖ్యంగా దీర్ఘకాలంగా టొకిలిజుమాబ్‌ ఇంజక్షన్‌ తీసుకుంటున్నవారు
4. ఆక్సిజన్‌ సపోర్టు, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కోవిడ్‌ పేషెంట్లు.

బ్లాక్‌ ఫంగస్‌ను ఎలా గుర్తించాలి?
1. ముక్కు నుంచి రక్తం కారడం లేదా బ్లాక్‌ డిశ్చార్జ్‌ కావడం
2. ముక్కు దిబ్బడ, తలనొప్పి, కళ్ల చుట్టూ చర్మం ఉబ్బడం, కళ్లు ఎర్రబారడం, ఒక వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం, కంటి చూపు కోల్పోతున్నట్లుగా అనిపించడం, కళ్లు తెరవడం, మూయడంలో తీవ్రమైన ఇబ్బంది
3. ముఖం తిమ్మిరిగా అనిపించడం, స్పర్శ కోల్పోతున్న అనుభూతి
4. ఆహారం నమలడంలో ఇబ్బంది, నోరు తెరవలేకపోవడం
5. దంతాలు వదులుకావడం, నోటిలోపలి భాగం ఉబ్బడం

ఏం చేయాలి?
1. పై లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే ఈఎన్‌టీ వైద్యుడిని లేదా కంటి డాక్టరును సంప్రదించాలి. రెగ్యులర్‌గా చెకప్‌కి వెళ్లాలి. 
2. ముఖ్యంగా డయాబెటిస్‌ ఉన్న వాళ్లు షుగర్‌ లెవల్స్‌ తప్పక అదుపులో ఉంచాలి.
3. వైద్యుడిని సంప్రదించకుండా స్టెరాయిడ్స్‌, యాంటీ ఫంగల్‌ మందులు అస్సలు వాడకూడదు.
4. డాక్టర్ల సూచన మేరకు పారానాసల్‌, సైనస్‌ టెస్టులు చేయించుకోవడం

చదవండి: మ్యూకోర్‌మైకోసిస్ అంటే ఏమిటి?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top