గేరు మార్చిన కేజ్రీవాల్‌.. ఆ పార్టీతో దోస్తీకి గ్రీన్‌కార్డ్‌

Aam Aadmi Party Alliance With Twenty20 Party - Sakshi

ఇటీవల పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల అనంతరం ఆప్‌.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. 

ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఇటీవలి కాలంలో గుజరాత్‌, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించి ఆప్‌కు ఒక్కసారి ఛాన్స్‌ ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఈ క్రమంలోనే దక్షిణాదిపై కొంచెం ఫోకస్‌ పెంచారు. ఇందులో భాగంగానే ఆదివారం కేరళ వెళ్లిన కేజ్రీవాల్‌ కీలక ప్రకటన చేశారు. కేరళలో ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ట‍్వంటీ20 పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టు తెలిపారు. కొచ్చీలో కేజ్రీవాల్‌.. ట్వంటీ20 పార్టీతో కలిసి పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్‌ను ప్రకటించారు. 

ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. కేరళలో తమ కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీ మోడల్‌ మాదిరిగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. మీకు(మలయాళీలకు) అభివృద్ధి, పాఠశాలలు, ఆసుపత్రులు కావాలంటే తమ కూటమిని గెలిచిపించాలని కోరారు. అల్లర్లు, అవినీతి కావాలంటే ఇతర రాజకీయ పార్టీల గెలుపించుకోవాలని సూచించారు. తాము గెలిస్తే కేరళలో కూడా ఢిల్లీలోలాగా 24 గంటల ఉచిత కరెంట్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top