ఉపాధి కోసం వచ్చాం.. | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కోసం వచ్చాం..

Jun 29 2025 2:29 AM | Updated on Jun 29 2025 2:29 AM

ఉపాధి

ఉపాధి కోసం వచ్చాం..

ఉత్తరప్రదేశ్‌ నుంచి మొత్తం 60 మందికి వచ్చాం. మాకు అక్కడ ప్రస్తుతం పనులు లేవు. ఇక్కడ కొన్ని ఎకరాల చొప్పున గుత్త మాట్లాడుకొని పనులు చేస్తాం. మాకు తినడానికి, ఉండడానికి అవసరమయ్యే సౌకర్యాలు రైతులు కల్పిస్తారు. మేం అందరం కూడా కలిసి పని చేస్తాం. వచ్చిన డబ్బును అందరం సమానంగా పంచుకుంటాం. మాకు ఒక కాంట్రాక్టర్‌ ఉంటాడు. ఆయనే మాకు పొలాలను చూయించి రైతులకు, మాకు మధ్య వారధిగా ఉంటాడు.

– లవ్‌కుమార్‌, వలస కూలి, యూపీ

వారి వల్లే సరైన సమయంలో నాట్లు..

మహారాష్ట్ర, బీహార్‌ ప్రాంతాల నుంచి జిల్లాలో వరినాట్లు వేసేందుకుగాను కూలీలు వస్తుంటారు. వీరు రావడం మూలంగా మా పొలాల్లో సరైన సమయంలో వరి నాట్లు వేస్తున్నాం. దాంతో అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో కూలీల కొరత ఎక్కువగా ఉండడం, అది కూడా అధిక రేట్లు అడుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలు లేకుండా వలస కూలీల ద్వారా మా పొలాలు సాగు చేస్తున్నాం.

– రవిగౌడ, గుర్జాల్‌ రైతు

ఉపాధి కోసం వచ్చాం.. 
1
1/1

ఉపాధి కోసం వచ్చాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement