నంద్యాల (వ్యవసాయం): జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను జూలై 11న నిర్వహిస్తున్నట్లు మూడో అదన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి అమ్మన్న రాజ తెలిపారు. కోర్టు ఆవరణలో పోలీస్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ..పోలీస్ స్టేషన్లలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను గుర్తించి పరిష్కరించాలన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించి వారి మధ్య రాజీ కుదర్చాలన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీకర్రి, డీఎస్పీ మంద జావలి, వివిధ పోలీస్ స్టేషన్ సీఐలు, ఎస్‌ఐలు, ఎకై ్సజ్ అధికారులు, లోకదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.
ట్రావెల్ బస్సుకు
రూ. 5.15 లక్షల జరిమానా
డోన్ టౌన్: ట్యాక్స్ చెల్లించకుండా వెళ్తున్న ట్రావెల్ బస్సు(జబ్బార్ ట్రావెల్స్)కు రూ.5.15 లక్షల జరిమానా విధించినట్లు డోన్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్ తెలిపారు. జాతీయ రహదారిపై ఉన్న అమకతాడు టోల్ ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు తనిఖీలు నిర్వహించారు. బెంగళూరుకు చెందిన జబ్బార్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి మైసూర్‌కు వెళుతుండగా ఆపి తనిఖీ చేశారు. రోడ్డు ట్యాక్స్ చెల్లించకుండా వెళుతున్నట్లు గుర్తించి ఈ జరిమానా విధించినట్లు ఎంవీఐ తెలిపారు.
నేడే నీట్ రీఎగ్జామ్
● నంద్యాలలో ఐదు పరీక్ష కేంద్రాలు
నంద్యాల: నీట్ యూజీ రీ ఎగ్జామ్‌ను ఆదివారం పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నంద్యాల పట్టణంలో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పీఎస్సీ కేవీఎస్సీ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలో పరీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం 1,521 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమై సాయంత్రం 5.15 గంటల వరకు జరుగుతుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30గంటల్లోపు చేరుకోవాలి. ఆ తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎవరినీ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా లైవ్ మానిటరింగ్ ఉంటుంది.
దివ్యాంగ విద్యార్థులకు
అదనపు సమయం
నీట్ యూజీ రీ ఎగ్జామ్‌లో దివ్యాంగ విద్యార్థులకు అదనంగా ఒక గంట సమయం కల్పించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ తెలిపారు. విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తన చాంబర్ నుంచి వీడియో సమావేశంలో పాల్గొన్నారు.


