● మధ్యాహ్న భోజనంలో అమలు కాని మెనూ
రుద్రవరం: పలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని విద్యార్థులు తింటున్నారు. మరికొన్నిచోట్ల ఏజెన్సీ నిర్వాహకులు వడ్డించిందే తినాల్సిన పరిస్థితి నెలకొంది. రుద్రవరం మందలూరు ప్రభుత్వ పాఠశాలలో శనివారం బెల్లం పొంగలిని వడ్డించలేదు. విద్యార్థులు కేవలం అన్నం, చారు మాత్రమే తిన్నారు. ఇక్కడ పాఠశాలలో తాగేందుకు నీరులేక పోవడంతో పక్కనే ఉన్న శుద్ధజలం ప్లాంట్ వద్దకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ ఒక్కో విద్యార్థి రూ.2 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ సమస్యపై ఎంఈఓ వెంకటస్వామిరెడ్డిని వివరణ కోరగా.. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


