దేవలమ్మనాగారంలో హైనా సంచారం
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారం గ్రామ పరిసరాల్లో హైనా సంచారం హల్‌చల్ చేసింది. గ్రామ పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని కొంతమంది గ్రామంలో చెప్పడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో చిరుతపులి సంచరిస్తుందని మొదటగా పాఠశాల విద్యార్థులు చూసి చెప్పడంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గ్రామంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అయితే ఓ గొర్రెల కాపరి అది హైనా అని అటవీశాఖ సిబ్బందికి, పోలీసులకు చెప్పాడు. చిరుతపులి ఆనవాళ్లు కనిపించకపోవడంతో అధికారులు తిరిగి వచ్చారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఫ చిరుతపులి అనుకొని
భయాందోళన చెందిన గ్రామస్తులు


