రైతు నేస్తం.. వాట్సాప్ చానల్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన వాట్సాప్ చానల్ అన్నదాతలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. పంటల తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేస్తారు. తద్వారా సాగు ఖర్చులు తగ్గడంతో పాటు మంచి దిగుబడులు కూడా పొందవచ్చు.
– శ్రవణ్‌కుమార్, డీఏఓ, నల్లగొండ
ఫ అధికారిక చానల్
ప్రారంభించిన వ్యవసాయ శాఖ
ఫ దీని ద్వారా అన్నదాతలకు సలహాలు,
సూచనలు ఇవ్వనున్న అధికారులు
దేవరకొండ: పంటల సాగులో తరుచూ ఎదురయ్యే తెగుళ్లు, వాటి నివారణకు సరైన మందుల ఎంపికలో అవగాహన లోపం కారణంగా రైతులు ఆశించిన మేర దిగుబడులు సాధించ లేక నష్టపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సాంకేతికత ఆధారంగా రైతుల ముంగిట ముఖ్య సమాచారాన్ని అందించేందుకు ఈ ఏడాది ఆగస్టు 8న ప్రత్యేక అధికారిక వాట్సాప్ చానల్‌ను ప్రారంభించింది. రైతు వేదికల ద్వారా ఇప్పటికే సమాచార కల్పన ప్రారంభమైంది. త్వరలో వాట్సాప్ చానల్‌పై ప్రతి గ్రామంలో ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తారు.
చానల్ ద్వారా లభించే ప్రయోజనాలు
ఫ తెగుళ్ల గుర్తింపు, నివారణకు సరైన సలహాలు
ఫ రోగ నిరోధక వంగడాలు, గుణాత్మక విత్తనాల ఎంపికలో మార్గదర్శకత్వం
ఫ పంటల రక్షణ, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణపై సూచనలు
ఫ వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల వివరాలు
ఫ రాయితీ విత్తనాల లభ్యత, మౌలిక వసతులపై తాజా సమాచారం
నిపుణుల సలహాలు
రైతులు సాగు చేసే పంటకు మొలక దశ నుంచి కోత దశ వరకు ఏ తెగులు వచ్చినా, దాని ఫొటోను చానల్‌కు పోస్టు చేస్తే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆ తెగుళ్లను వెంటనే గుర్తిస్తారు. తెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ మందులు ఏ మోతాదులో ఉపయోగించాలో వివరిస్తారు. చానల్‌లో చేరేందుకు ఆయా గ్రామ రైతులు తమ క్లస్టర్ పరిధిలోని అసిస్టెంట్ అగ్రికల్చర్ అధికారి (ఏఈవో)ను సంప్రదించాల్సి ఉంటుంది. వారికి సదరు రైతు తమ మొబైల్ నంబర్ అందిస్తే వారు వాట్సాప్ చానల్‌లో చేరుస్తారు.
రైతు నేస్తం.. వాట్సాప్ చానల్
రైతు నేస్తం.. వాట్సాప్ చానల్


