ఫ మహాశివుడికిలక్ష్మీ అలంకరణ
చెర్వుగట్టు ఇన్‌చార్జి ఈఓగా మోహన్‌బాబు
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇన్‌చార్జి ఈఓగా మోహన్‌బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం ఆంథోల్ మైసమ్మ, వేములకొండ ఆలయాల ఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జి ఈఓగా పనిచేసిన నవీన్‌కుమార్‌ను చెర్వుగట్టు బాధ్యతల నుంచి తప్పిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ చెర్వుగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తానని పేర్కొన్నారు.
ఫుట్‌బాల్ సెలక్షన్ పోటీలు ప్రారంభం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో శుక్రవారం ఎస్‌జీఎఫ్ అండర్–14, 17 ఫుట్‌బాల్ బాల, బాలికల ఫుట్‌బాల్ సెలక్షన్ పోటీలను ఎస్‌జీఎఫ్ కార్యదర్శి విమల శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి 300 మంది క్రీడాకారులు పోటీలకు హాజరైనట్లు తెలిపారు. ఇక్కడ ప్రతిభ కనభర్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ అక్బర్ అలీ, వ్యాయామ ఉపాధ్యాయులు బొమ్మపాల గిరిబాబు, యుగందర్‌రెడ్డి, గఫార్, రేణుక, భావన, మాణిక్యం, అలిమ్, కళావతి, కవిత, నుస్రత్ సుల్తానా పాల్గొన్నారు.
జీఎన్‌ఎం శిక్షణకు దరఖాస్తులు
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ, ప్రైవేట్ జనరల్ నర్సింగ్, మిడ్ వైపరి (జీఎన్‌ఎం) 3 సంవత్సరాల శిక్షణ కోర్సులో ప్రవేశానికి అర్హత గల పురుష, మహిళా అభ్యర్థుల నుంచి నవంబరు 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు డీఎంహెచ్‌ఓ కార్యాలయ ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని సూచించారు.
ఎన్జీ కళాశాలకు ద్వితీయ బహుమతి
నల్లగొండ : జిజ్ఞాస రాష్ట్రస్థాయి పోటీల్లో ఎన్జీ కళాశాల విద్యార్థులు ద్వితీయ బహుమతి పొందారు. ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా నిర్వహించిన పోటీల్లో ఎన్జీ కళాశాల ఫిజిక్స్ విభాగం విద్యార్థులు అగ్రికల్చర్ వీడర్ యంత్రాన్ని రూపొందించి ప్రదర్శించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికై ద్వితీయ బహుమతి సాధించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ విద్యార్థుల తరఫున బహుమతి అందుకున్నారు. ప్రాజెక్టు రూపొందించిన విద్యార్థులను శుక్రవారం ఆయన అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశం, రిటైర్డ్ ఉపాధ్యాయుడు రవిప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ మహాశివుడికిలక్ష్మీ అలంకరణ
ఫ మహాశివుడికిలక్ష్మీ అలంకరణ


