అండ చూపరు.. ఆదుకోరు
చందంపేట : చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురైన నక్కలగండితండా వాసుల్లో ఎవరిని కదిలించిన కన్నీటి వరద పారుతోంది. 2008లో ప్రారంభమైన నక్కలగండి ప్రాజెక్టు పనులు నేటికీ నత్తనడకన సాగుతుండడంతో.. ఇక్కడ ముంపునకు గురవుతున్న గిరిజనులు తండాలోనే ఉంటూ భూములు సాగు చేసుకుంటున్నారు. మంగళ, బుధ వారాల్లో కురిసిన వర్షాల వల్ల వారు సాగు చేసిన పంటలు నీటి పాలయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో రెవెన్యూ అధికారులు తెల్దేవర్‌పల్లిలోని ఆశ్రమ పాఠశాలలో వారికి తాత్కాలిక పునరావాసం కల్పించారు.
ఇళ్లస్థలాలు ఇవ్వలే..
నక్కలగండి నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో భాగంగా చింతపల్లి వద్ద ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. ఏళ్లు గడుస్తున్న ఇప్పటివరకు వారికి అక్కడ ప్లాట్లను ఇవ్వలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో వారు నక్కలగండితండాలో ఉంటున్నారు. చింతపల్లి వద్ద ప్లాట్లను కేటాయిస్తే.. కూలీనాలి చేసుకొని బతుకుతామని, ఇక్కడ పంట పొలాలు నీటిలో మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఫ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ
ఫ దిక్కుతోచని స్థితిలో నక్కలగండి నిర్వాసిత కుటుంబాలు


