ధాన్యం ఎలా ఉన్నా కొనుగోలు చేయాలి
చిట్యాల, నకిరేకల్ : అకాల వర్షంతో ధాన్యం తడిసినందున.. ఏ విధంగా ఉన్నా వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో ధాన్యం, పంటల పరిశీలన భాగంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన చిట్యాల, నకిరేకల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ రైతులు 20 రోజులుగా కేంద్రాలకు ధాన్యం తెచ్చి కాంటాలు కాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ధాన్యం తూకంలో తేడాల విషయంలో రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ నేతలు కుమ్మకై ఉంటే వారిపై చర్యలు తీసుకుని జైలు పంపించాలన్నారు. తేమశాతం ఎలా ఉన్నా తూకంలో మోసాలు జరగకుండా దిగుమతులు జరిగేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి గోలి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర నేతలు గంగడి మనోహర్‌రెడ్డి, చికిలంమెట్ల అశోక్, పిల్లి రామరాజ్‌యాదవ్, వీరెళ్లి చంద్రశేఖర్, శ్యాంసుందర్, నకిరేకంటి మొగిలయ్య, గుడుగుంట్ల సాయన్న, మండల వెంకన్న, గర్రె మరళి మోహన్, బుడిగే సైదులు,యానాల శ్రీనివాస్‌రెడ్డి, కొండెటి శ్రీను, మైల నర్సింహ, పీక వెంకన్న, నర్సింహగౌడ్, గుండాల నరేష్‌గౌడ్, పాపని వాసుదేవ్, అంశల అనిల్‌కుమార్, కన్నేబోయిన మహాలింగం ఉన్నారు.
ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు


