 
															నేడు యూనిటీ మార్చ్
నల్లగొండ టూటౌన్ : భారత మాజీ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ శుక్రవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయం నుంచి పెద్ద గడియారం సెంటర్ వరకు యూనిటీ మార్చ్ నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి తెలిపారు. గురువారం బీజేపీ కార్యాలయంలో వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వల్లభాయ్‌పటేల్ ఉప ప్రధానిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా దేశానికి, దేశప్రజలకు ఎనలేని సేవ చేశారని కొనియాడారు. యూనిటీ మార్చ్‌లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్‌డ్డి, ఉపాధ్యక్షుడు పకీరు మోహన్‌రెడ్డి, మిర్యాల వెంకటేశం, పిన్నింటి నరేందర్‌రెడ్డి, దుబ్బాక సాయికుమార్, మేకల అనిల్‌కుమార్, దాసరి కృష్ణ పాల్గొన్నారు.
ప్రవాహం తగ్గడంతో గురువారం యథాస్థితిలో కనిపిస్తున్న గురుకుల పాఠశాల

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
