 
															నందనంలో విషాదఛాయలు
భువనగిరి: భువనగిరి మండలంలోని నందనం గ్రామానికి చెందిన రచ్చ కృష్ణవేణి(45) తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా వాగులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణవేణి తండ్రి రవీందర్ ఈ నెల 25న మృతిచెందగా అంత్యక్రియల నిమిత్తం ఇబ్రహీంపట్నం నెర్రపల్లి గ్రామానికి వెళ్లింది. గురువారం పంచదినకర్మ సందర్భంగా తండ్రి అస్థికలను వాడపల్లిలోని కృష్ణానదిలో కలిపేందుకు ఆమె భర్త ప్రభాకర్‌తో కలిసి వెళ్లింది. సాయంత్రం తిరిగి నెర్రపల్లి గ్రామానికి వచ్చారు. అనంతరం బైక్‌పై భర్తతో కలిసి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని మజీద్‌పూర–బాటసింగారం మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే క్రమంలో అందులో పడిపోయారు. స్థానిక యువకులు గమనించి ప్రభాకర్‌ను బయటకు తీయగా కృష్ణవేణిని కాపాడేలోపు ఆమె మృతి చెందింది. కృష్ణవేణి గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తుంది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉంది.
ఫ తండ్రి అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా వాగులో పడి మహిళ మృతి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
