జాతీయ రహదారిపై కెమికల్ ట్యాంకర్ బోల్తా
కేతేపల్లి: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద బుధవారం సాయంత్రం కెమికల్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం హైదరాబాద్ నుంచి కెమికల్ ట్యాంకర్ విజయవాడకు బయల్దేరింది. మార్గమధ్యలో కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా దాటిన వెంటనే ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో ట్యాంకర్‌లోని కెమికల్ రోడ్డుపై పడి నురగలు రాటడంతో పాటు తెల్లని పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న కేతేపల్లి పోలీసులు, నకిరేకల్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై పడిన పారిన కెమికల్‌ను నీటితో శుభ్రం చేశారు. అనంతరం పోలీసులు క్రేన్ల సహాయంలో ట్యాంకర్‌ను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.


