ఢిల్లీలో ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ సదస్సుక
రామగిరి(నల్లగొండ): దేశ రాజ ధాని ఢిల్లీలో గురువారం, శుక్రవారం జరగనున్న ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ సదస్సుకు నల్లగొండ పట్టణంలోని గొల్ల గూడ పీఏసీఎస్ ఎంపికై ంది. ఈ మేరకు పీఏసీఎస్ చైర్మన్ నాగరత్నంరాజు బుధవారం సీఈఓ కంచర్ల అనంతరెడ్డితో కలిసి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా నాగరత్నంరాజు మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి 5 సొసైటీలు ఎంపిక కాగా అందులో గొల్లగూడ సొసైటీ ఒకటని పేర్కొన్నారు.
ఆత్మకూర్(ఎం) పీఏసీఎస్ కూడా..
ఆత్మకూరు(ఎం): ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ సదస్సుకు ఆత్మకూరు(ఎం) పీఏసీఎస్ కూడా ఎంపిక కాగా.. పీఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి, సీఈఓ యాస కిరణ్ బుధవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
రామన్నపేట: కుటుంబ సమస్యలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. బుధవారం రామన్నపేట ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన శివరాత్రి తేజ, అతడి భార్య శిరీష మధ్య ఇటీవల గొడవ జరిగింది. దీంతో శిరీష తరఫు కుటుంబ సభ్యులు, కుల పెద్దలు తేజను మందలించారు. దీంతో ఈ నెల 25న తేజ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి కోసం బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. తేజ భార్య శిరీష రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఢిల్లీలో ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ సదస్సుక


