ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
హలియా : గుర్రంపోడు మండలంలోని కొప్పోలు, చామలోనిబావి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం పరిశీలించారు. చామలోనిబావి కేంద్రంలో వరద నీరు ప్రవహిస్తుండటాన్ని గమనించిన ఆమె వరద ఎక్కువై కుప్పలు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు తగ్గేవరకు వరికోతలు కోయవద్దని, పచ్చి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకునిరావద్దని రైతులకు సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ విజయభాస్కర్, ఏఓ మాధవరెడ్డి, ఏపీఎం ఏశయ్య తదితరులు ఉన్నారు.


