సామాజిక రుగ్మతలను రూపుమాపాలి | - | Sakshi
Sakshi News home page

సామాజిక రుగ్మతలను రూపుమాపాలి

Oct 30 2025 7:37 AM | Updated on Oct 30 2025 7:37 AM

సామాజ

సామాజిక రుగ్మతలను రూపుమాపాలి

నాటికను ప్రదర్శిస్తున్న కళాబృందం మాట్లాడుతున్న వీసీ అల్తాఫ్‌ హుస్సేన్‌

నల్లగొండ టూటౌన్‌ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ సామాజిక రుగ్మతల రూపుమాపడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు. ‘ఎంజాయ్‌ పేరుతో గంజాయి వద్దు’ పేరుతో తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌ వరకు నిర్వహిస్తున్న బస్సు కళాజాత బృందం బుధవారం ఎంజీ యూనివర్సిటీకి చేరుకుంది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు తమలోని నైపుణ్యాలను గుర్తించి సాధనతో ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజానాట్య మండలి సామాజిక రుగ్మతలపై కళాజాతాలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. అనేక ప్రజా పోరాటాల్లో విద్యార్థుల పాత్ర వారి త్యాగాలు మరువలేనివని, యువశక్తి.. దేశ ప్రగతికి, సామాజిక మార్పునకు ఉపయోగపడాలన్నారు. తెలంగాణ భాష సాంస్కతిక శాఖ సలహా మండలి సభ్యుడు పల్లె నరసింహ బృందం ఆధ్వర్యంలో గంజాయి మహమ్మారిపై లఘు నాటికను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాబృందం పాటలు, నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌, విద్యార్థి నాయకులు, రెహమాన్‌, మురళి, జిల్లా యాదయ్య, అధ్యాపకులు మారం వెంకటరమణారెడ్డి, అనితాకుమారి, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌

సామాజిక రుగ్మతలను రూపుమాపాలి1
1/1

సామాజిక రుగ్మతలను రూపుమాపాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement