
పేరుకుపోతున్న వ్యర్థాలు
దేవరకొండ: దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డులున్నాయి. ప్రతి నిత్యం గృహ, వాణిజ్య సముదాయాల నుంచి సుమారు 16 టన్నుల మేర చెత్తను పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది సేకరించి పట్టణ శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ డంపింగ్ యార్డులో ఇనుము, కాపర్ వంటి వాటి కోసం వచ్చే వారు వ్యర్థాలను తగలబెడుతుండడంతో ఈ దారి గుండా వెళ్లే వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పట్టణం నుంచి ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు అత్యధికంగా వస్తుండడంతో డంపింగ్ యార్డులో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి.