
చెల్లాచెదురుగా వ్యర్థాలు
చండూరు: చండూరు మున్సిపాలిటీకి సంబంధించి డంపింగ్‌యార్డును శిర్ధేపల్లి రోడ్డులో 1.9 ఎకరాల భూమిని కేటాయించారు. ప్రతిరోజు మూడు ట్రాక్టర్లు, ఒక ఆటో ద్వారా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. చెత్తను ఇష్టారీతిన వదిలేయడంతో వ్యర్థాలన్నీ చెల్లాచెదురుగా పడుతున్నాయి. చెత్తను కాల్చకుండా బయోమైనింగ్ చేయాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ నుంచి టెండర్లు పిలిచినా అది కార్యరూపం దాల్చలేదు. డంపింగ్ యార్డులో తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేసి మున్సిపాలిటీ పరిధిలోని పార్కుల్లో మొక్కలకు ఎరువుగా వినియోగించేందుకు దాదాపు నాలుగు గదుల వైశాల్యంలో వర్మీ కంపోస్టు తయారీకి బెడ్లు తయారు చేసి వదిలేశారు.