
గురుకులాల్లో వసతులపై ఆరా
దేవరకొండ, కొండమల్లేపల్లి, డిండి, చందంపేట : దేవరకొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ సంక్షేమ గురుకులాను సందర్శించి.. అక్కడి మౌలిక వసతులపై ఆరా తీశారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. శుక్రవారం దేవరకొండ మండలంలోని పెంచికల్‌పహాడ్, కొమ్మేపల్లి, కొండభీమనపల్లి, కొండమల్లేపల్లి, డిండి, చందంపేటలోని సాంఘిక, గిరిజన, మైనార్టీ, వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలు, కళాశాలల్లో రికార్డులు పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, మెనూపై ఆరా తీశారు. కల్పిస్తున్న వసతుల వివరాలను ప్రిన్సిపాళ్లను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమణారెడ్డి, ఆర్సీఓలు బలరాంనాయక్, స్వప్న, విష్ణు, జోనల్ ఆఫీసర్ విద్యారాణి, ఆయా గురుకులాల ప్రిన్సిపాల్స్, సిబ్బంది ఉన్నారు.
కలెక్టర్ దృష్టికి సమస్యలు
● పెంచికల్‌పహాడ్ పాఠశాలకు ఓహెచ్‌ఎస్‌ఆర్, విద్యార్థులకు సరిపడా బెడ్స్, అదనపు గదుల నిర్మాణం అవసరమని ప్రిన్సిపాల్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
● కొమ్మేపల్లి, కొండభీమనపల్లి పాఠశాలల్లో డ్యూయల్ డెస్క్‌లు, బెంచీలు, ఓహెచ్‌ఎస్‌ఆర్, ట్రాన్స్‌ఫార్మర్, టాయిలెట్స్ అవసరం ఉన్నట్లు ప్రిన్సిపాల్స్ కలెక్టర్‌కు వివరించారు.
● కొండమల్లేపల్లి ఎస్సీ గురుకుల కళాశాలలో బెడ్స్, ఓహెచ్‌ఎస్‌ఆర్, అదనపు టాయిలెట్స్ కావాలని ప్రిన్సిపాల్ కలెక్టర్‌కు విన్నవించారు.
● డిండి ఎస్సీ గురుకులంలో డ్రెయినేజీ, వాటర్ పైపులైన్ కోతుల బెడద తదితర సమస్యలు ఉన్నాయని.. ప్రహరిగోడకు సోలార్ పెన్షింగ్ కావాలని ఇప్పటి వరకే సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించాలని ప్రిన్సిపాల్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
● చందంపేట మినీ గురుకులంలో డెర్మాటరి బ్లాక్ కావాలని, తాగునీటి సమస్య ఉందని ప్రిన్సిపాల్ కలెక్టర్‌కు విన్నవించారు.
ఫ దేవరకొండ నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూళ్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

గురుకులాల్లో వసతులపై ఆరా